దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఈ మహమ్మారి కేసులపై వివరణ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 606 కేసులు నమోదైనట్లు తెలిపింది. అందులో 553 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది.
దేశంలో 600 దాటిన కరోనా కేసులు: కేంద్ర ఆరోగ్యశాఖ - corona latest cases
దేశంలో కరోనా కేసులు రోజురోజకు పెరిగుతున్నాయి. ఇప్పటివరకు భారత్లో 606మందికి వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో 606కి చేరిన కరోనా కేసులు
ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి 10 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది ఆరోగ్యశాఖ. 42 మంది పూర్తిగా కోలుకున్నట్లు వివరించింది.