అధికరణ 370, 35ఏలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు పీడీపీ అధినేత్రి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. ఏకపక్షంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. నేడు భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు.
ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం విపత్కర పరిణామాలను కలిగిస్తుందన్నారు ముఫ్తీ. ప్రస్తుత నిర్ణయంతో ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ప్రజలను భయపెట్టడం ద్వారా జమ్ముకశ్మీర్ భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు.