తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇస్రో సారథి శివన్​కు 'అబ్దుల్​ కలాం' అవార్డు ప్రదానం - శివన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఛైర్మన్​, రాకెట్​ మ్యాన్​గా పేరొందిన డాక్టర్​ కే శివన్​కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్​ కలాం పురస్కారం ప్రకటించింది. నేడు తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు శివన్​.

ఇస్రో సారథి శివన్​కు 'అబ్దుల్​ కలాం' అవార్డు ప్రదానం

By

Published : Aug 22, 2019, 6:32 PM IST

Updated : Sep 27, 2019, 9:50 PM IST

తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే డాక్టర్​ ఏపీజే అబ్దుల్​కలాం పురస్కారాన్ని ఇస్రో ఛైర్మన్​ కే శివన్​ అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవలందించిన వారికి ఇచ్చే ఈ అవార్డుకు గతంలోనే తమిళనాడు ప్రభుత్వం శివన్​ను ఎంపికచేసింది.

స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ పురస్కారాన్ని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఆ కార్యక్రమానికి శివన్​ హాజరు కాలేకపోయారు. ఈ ఉదయం తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసిన శివన్​ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద 8 గ్రాముల విలువ చేసే బంగారు పతకం, 5 లక్షల రూపాయల నగదు అందజేశారు.

శివన్​ నేతృత్వంలోనే ఇస్రో.. చంద్రయాన్​-2ను ఇటీవల విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఆయన భారత అంతరిక్ష రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డుకు ఎంపికచేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి: ఎంత అదృష్టం ఉంటే ఆ చిన్నారి బతికి బైటపడ్డాడు!

Last Updated : Sep 27, 2019, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details