కరోనా మహమ్మారి కట్టడికి పోలీసులు ముందుడి పోరాడుతున్నారు. వైరస్ బారిన పడి ఇప్పటికే చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మథురైకి చెందిన పోలీసులు.. తమ ఆయుష్షు పెంచాలని ఏకంగా యముడికే లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
"మేం ఏ బాధలో ఉన్నా.. ప్రజల జీవితాన్ని కాపాడటమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి మా జీవితకాలాన్ని దయాగుణంతో పొడిగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మా బాధ్యతలను నెరవేర్చామని అనుకుంటే.. ఈ దేశానికి ఉపయోగపడే మరణం మాకు ఉందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ స్వీకరించిన తర్వాత పోలీసుల మరణాలపై మీరు కొంత దయ చూపిస్తారని నమ్ముతున్నాం."