తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం - నూస్రత్​ జహన్

బెంగాలీ ప్రముఖ సినీ తారలు నూస్రత్​ జహన్​, మిమి చక్రవర్తిలు నేడు లోక్​సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. పార్లమెంట్​కు తొలిసారి ఎన్నికైన ఇద్దరు నటీమణులు తృణమూల్​ కాంగ్రెస్​ తరఫున గెలుపొందారు. ఎంపీగా ఎన్నికైన వెంటనే నూస్రత్​ జహన్​ పెళ్లి చేసుకున్నారు. ఆ కారణంతోనే నేడు ఎంపీగా ప్రమాణం చేశారు.

మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం

By

Published : Jun 25, 2019, 12:46 PM IST

Updated : Jun 25, 2019, 12:54 PM IST

నూస్రత్​ జహన్​, మిమి చక్రవర్తి ప్రమాణ స్వీకారం

బెంగాలీ ప్రముఖ నటి, తృణమూల్ ఎంపీ నూస్రత్ జహన్ లోక్​సభలో నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బంగాల్​లోని బషీర్​హత్​ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు జహన్​.
ఎంపీగా గెలుపొందిన వెంటనే కోల్​కతాకు చెందిన పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్​ను పెళ్లాడారు. టర్కీలోని బోడ్రమ్ నగరంలో జరిగిన బీచ్​ వెడ్డింగ్​లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. 17వ లోక్​సభ ప్రారంభంలోనే ప్రమాణం చేయాల్సి ఉండగా పెళ్లి కారణంగా వాయిదా పడింది. వివాహానంతరం నేడు ప్రమాణ స్వీకారం చేశారు జహన్​.

నూస్రత్​ జహన్​తో పాటు మరో నటి మిమి చక్రవర్తి.. లోక్​సభలో నేడు ఎంపీగా ప్రమాణం చేశారు. పశ్చిమ బంగాల్​లోని జాదవ్​పూర్​ లోక్​సభ స్థానం నుంచి ఎన్నికైన ఈమె.. తొలిసారి పార్లమెంట్​లో అడుగుపెట్టారు. నూస్రత్​ వివాహానికి అతిథిగా హాజరైనందున మిమి ప్రమాణం కూడా నేటికి వాయిదా పడింది.

Last Updated : Jun 25, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details