బంగాల్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బంగాల్లో ఎలాగైనా తమ జెండా పాతాలని భావిస్తున్న భాజపా ఎత్తులకు ఘాటుగా స్పందిస్తోంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ). ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ను తొలగించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది టీఎంసీ. గవర్నర్.. రాజ్యాంగ పరిధి ధాటి వ్యవహరించడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం, పాలన యంత్రాంగానికి వ్యతిరేకంగా పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది.
ధనకర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రపతికి లేఖ రాసింది టీఎంసీ ఎంపీల బృందం. ఈ లేఖలో రాజ్యసభ టీఎంసీ ఎంపీ సుఖెందు శేఖర్ రాయ్ సహా ఎంపీ కల్యాణ్ బెనర్జీ, సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఒబ్రెయిన్, కకోలి ఘోష్ దస్తీదర్ సంతకాలు చేశారు.