బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా టీఎంసీపై విమర్శలు చేశారు ధన్ఖర్. బంగాల్‌ను టీఎంసీ ప్రభుత్వం పోలీసు రాష్ట్రంగా మార్చిందన్నారు. తన కార్యాలయాన్ని చాలా కాలంగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అది రాష్ట్రంపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 154ను పరిశీలించేలా చేస్తోందని హెచ్చరించారు. పోలీసులు అధికార టీఎంసీ క్యాడర్‌గా పని చేస్తున్నారని తీవ్ర విమర్శ లు చేశారు.
" రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే.. నేనే రంగంలోకి దిగాల్సి వస్తుంది. గవర్నర్ కార్యాలయం చాలా కాలంగా విస్మరణకు గురవుతోంది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 వైపు చూసేలా చేస్తోంది. బంగాల్ పూర్తిగా పోలీసు రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. మావోయిస్టుల తిరుగుబాటు పెరిగింది. ఉగ్ర మూకలు కూడా రాష్ట్రం నుంచి పనిచేస్తున్నాయి.