బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. అందుకే బంగాల్లో తన ర్యాలీలకు అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు. బంగాల్ జయ్నగర్ కేనింగ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా.
జాదవ్పుర్ లోక్సభ నియోజకవర్గంలో అమిత్ షా సభకు అనుమతి నిరాకరించింది మమత ప్రభుత్వం. అక్కడ తాను ప్రచారం నిర్వహిస్తే ఆమె మేనల్లుడు ఓడిపోతారని మమత కలవరపడుతున్నారని విమర్శించారు షా. భాజపా ర్యాలీలను అడ్డుకోగలరేమో కానీ విజయాన్ని కాదన్నారు. మమతకు బంగాల్ ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని ధ్వజమెత్తారు.