తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిప్పు సుల్తాన్ ఆయుధాలకు కళ్లు చెదిరే ధర

మైసూర్ చివరి రాజు టిప్పు సుల్తాన్​కు చెందిన కొన్ని ఆయుధాలను వేలం వేశారు. లక్షా 7వేల పౌండ్లకు అవి అమ్ముడయ్యాయి. వాటిలోని ఓ తుపాకీ 60వేల పౌండ్ల ధర పలకడం విశేషం.

టిప్పు సుల్తాన్ ఆయుధాలకు కళ్లు చెదిరే ధర

By

Published : Mar 28, 2019, 9:24 AM IST

బ్రిటన్ బెర్క్​​షైర్​కు చెందిన ఓ జంట సేకరించిన కళాఖండాల్లోని మైసూర్​ సామ్రాజ్య చివరి రాజు టిప్పు సుల్తాన్​ ఆయుధాల వేలం జరిగింది. బెర్క్​షైర్​ కేంద్రంగా పని చేస్తున్న ఆంటోనీ 'క్రిబ్​ లిమిటెడ్ ' ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించారు. దీనికి పురాతన ఆయుధాల సేకరణ సంస్థగా మంచి పేరుంది.

టిప్పు సుల్తాన్​కు చెందిన ఆయుధాలు వేలంలో 107,000 పౌండ్లకు అమ్ముడయ్యాయి.

అందులో వెండితో తయారైన 20-బోర్​ ఫింట్​లాక్​ తుపాకీ, బాయ్​నెట్​ 60,000 పౌండ్లకు అమ్ముడవడం విశేషం.

వీటితో పాటు బంగారం పూత పూసినకత్తి సహా టిప్పు సుల్తాన్​ వ్యక్తిగత కత్తులన్నీ కలిపి18,500 పౌండ్లకు అమ్ముడయ్యాయి.

వీటిని దక్కించుకునేందుకు 58 బిడ్​లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఇక ఇతర వస్తువు విషయానికొస్తే...బెటెల్​​ నట్​ కాస్కెట్​ 17,500 పౌండ్లు, ఈస్ట్​ ఇండియా కంపెనీకి చెందిన గోల్డ్​ సీల్​ రింగ్​ 2,800 పౌండ్లకు అమ్ముడయ్యాయి.

ఇందులో మొత్తం 8 వస్తువులు వేలం వేయగా... అన్నింటికి కలిపి 107,000 పౌండ్లు వచ్చినట్లునిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details