లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు తెరవాలని మందుబాబులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లుపై జోకులు వేస్తున్నారు. వారికి మద్దతుగా నిలిచారు రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పుర్. చేతులపై ఉన్న కరోనాను ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లు చంపుతున్నప్పుడు.. అదే ఆల్కహాల్ మందుబాబుల గొంతులోని వైరస్‌ను అంతమొందించదని అనేందుకు ఎలాంటి కారణం లేదన్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలను తెరవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌కు ఈమేరకు లేఖ రాశారు.
'మద్యం తాగితే కరోనా చస్తుంది- షాపులు తెరవండి' - reopening of liquor shops news
ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్లపై మందుబాబులు వేస్తోన్న జోకులకు అధికారికంగా మద్దతు లభించింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం దుకాణాలు తెరవాలని డిమాండ్ చేస్తూ.. చేతులపై ఉన్న వైరస్‌ను శానిటైజర్లు చంపుతున్నప్పుడు.. గొంతులోని వైరస్‌ను మద్యం ఎందుకు చంపదో చెప్పేందుకు కారణం లేదన్నారు.
మద్యం అమ్మకాలను ప్రారంభించటం ద్వారా కల్తీ లిక్కర్ తాగి చనిపోతున్న వారిని రక్షించటమే కాక.. లాక్డౌన్లో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఆదాయం సమకూరుతుందని లేఖలో పేర్కొన్నారు భరత్. కల్తీ మద్యం తాగి భరత్‌పుర్ జిల్లాలో ఇద్దరు మరణించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు కుందన్‌పుర్. కరోనా వ్యాప్తికి ముందు 2019-20లో మద్యం అమ్మాకాలపై సుమారు రూ.12,500 కోట్లు ఆదాయ పొందాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని.. ఇప్పుడు అది అందనంత దూరంలోకి వెళ్లినట్లు గుర్తు చేశారు.
రాజస్థాన్‌లో మద్యం దుకాణాలను తెరవాలని భరత్ సింగ్ ఒక్కరే డిమాండ్ చేయటం లేదు. బంద్రా ఎమ్మెల్యే, సీపీఎం నేత బల్వాన్ సింగ్ పూనియా కూడా ఇదే తరహాలో వైన్ షాపులు తెరవాలని గతంలోనే సీఎంను కోరారు.