తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లద్దాఖ్​లోనే కేంద్ర పాలన-కశ్మీర్​లో ఎక్కువ కాలం కాదు' - MODI

ఆర్టికల్ 370, 35ఏల రద్దుపై జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లలో కేంద్రపాలన విధించడంపై వివరణ ఇచ్చారు. అంచనాల మేరకు కశ్మీర్​లో మార్పులు వస్తే కేంద్రపాలనను ఎత్తేస్తామని, లద్దాఖ్​ని మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుతామన్నారు.

'లద్దాఖ్​లోనే కేంద్ర పాలన-కశ్మీర్​లో ఎక్కువ కాలం కాదు'

By

Published : Aug 9, 2019, 5:36 AM IST

Updated : Aug 9, 2019, 6:46 AM IST

ఆర్టికల్ 370, 35ఏ ల రద్దు అనంతరం జమ్ముకశ్మీర్, లద్దాఖ్​లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంపై వివరణ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అనుకున్న విధంగా కశ్మీర్ అభివృద్ధి సాధిస్తూ ఉంటే తక్కువ కాలంలోనే జమ్ముకశ్మీర్​లో కేంద్ర పాలిత ప్రాంత స్థాయిని ఎత్తేస్తామని ఉద్ఘాటించారు మోదీ. కానీ లద్దాఖ్​లో మాత్రమే కేంద్ర పాలన కొనసాగుతుందన్నారు.

ఒక వ్యవస్థ కారణంగా జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌కు చెందిన ప్రజలు అనేక హక్కులు కోల్పోయారని.. మనందరి ప్రయత్నాల కారణంగా ఆ వ్యవస్థ దూరమైందని ఉద్ఘాటించారు మోదీ. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లో కొత్తయుగం ప్రారంభమైందని అన్నారు.

'లద్దాఖ్​లోనే కేంద్ర పాలన-కశ్మీర్​లో ఎక్కువ కాలం కాదు'

మీ ప్రజాప్రతినిధులు మీ ద్వారానే ఎన్నికవుతారు. మీ మధ్యనుంచే ఎన్నికవుతారు. ముందున్నట్లుగానే ఎమ్మెల్యేలు ఉంటారు. మంత్రి మండలి ఉంటుంది.. ముఖ్యమంత్రి ఉంటారు.. నాకు పూర్తి విశ్వాసం ఉంది... ఈ నూతన వ్యవస్థ ద్వారా మనమందరం కలసి ఉగ్రవాదం, వేర్పాటువాదం నుంచి జమ్ముకశ్మీర్​ను విముక్తి చేయాలి.. భూతల స్వర్గమైన కశ్మీర్.. అభివృద్ధి చెంది మరోసారి ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. పౌరుల జీవన విధానంలో సులభతర జీవన విధానం ప్రారంభమవుతుంది... పౌరుల హక్కులు, వారికి కావల్సినవి అందుతాయి. శాసన, అధికారుల వ్యవస్థ అంతా ప్రజాసంక్షేమం కోసం ముందుకు నడిస్తే... కేంద్ర అధికారం జమ్ముకశ్మీర్​లో ఎక్కువ కాలం ఉండదు... కానీ లద్దాఖ్​లో మాత్రం అలాగే కొనసాగుతుంది.

-నరేంద్రమోదీ ప్రధానమంత్రి

Last Updated : Aug 9, 2019, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details