టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేసేందుకు ప్రమాదక విన్యాసాలు చేస్తూ గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
టిక్‌టాక్ గాయం.. తీసింది ప్రాణం
టిక్‌టాక్ కోసం వినూత్నంగా వీడియో రూపొందించాలన్న ఆశ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వీడియో కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ఈ నెల 17న గాయపడిన కర్ణాటకకు చెందిన కుమార్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
టిక్‌టాక్ గాయం.. తీసింది ప్రాణం
కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా గూడెకెరెలో ఉంటున్న కుమార్(26) అనే యువకుడు ఈ నెల 17వ తేదీన టిక్‌టాక్ కోసం వినూత్నంగా వీడియో రూపొందించాలని విన్యాసాలు చేశాడు. ఆ క్రమంలో కిందపడిపోయి అతడి మెడ పూస విరిగింది. వెంటనే చికిత్స కోసం అతడిని కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు.