నిర్జీవంగా పడి ఉన్న జంతువులు ఎలా మరణించాయో తెలియాల్సి ఉంది. పులుల మృతికి కారణాలు అన్వేషిస్తున్నామని ముఖ్య సంరక్షణ అధికారి ఎస్ వీ రామారావు తెలిపారు.
ఆ మూడు పులులు ఎలా చనిపోయాయి?
మహారాష్ట్రలోని చంద్రపూర్ అటవీ ప్రాంతంలో మూడు పులులు మృత్యువాత పడ్డాయి. వీటిలో ఓ తల్లి పులి, తన రెండు పిల్లలు ఉన్నాయి. ఈ వన్యప్రాణుల మరణానికి కారణాలు తెలుసుకునేందుకు చిమూర్ అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆ మూడు పులులు ఎలా చనిపోయాయి?
తబోడా అంధరీ టైగర్ రిజర్వ్ ఈ పులులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ రిజర్వ్ చంద్రపూర్ జిల్లాలోనే ఉంది. అక్కడి నుంచే ఈ పులులు విహారానికి వచ్చి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామం సమీపంలోనే వన్య మృగాల మృతదేహాలు బయట పడినందున గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి:తమిళనాడులో 9వ శతాబ్దంలోనే సైకిల్..!