తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- నలుగురు నక్సల్స్​ హతం - తుపాకులు

ఛత్తీస్​గఢ్​ ధంతరి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఘటన స్థలం నుంచి మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- నలుగురు నక్సల్స్​ హతం

By

Published : Jul 6, 2019, 12:33 PM IST

Updated : Jul 6, 2019, 1:00 PM IST

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- నలుగురు నక్సల్స్​ హతం

ఛత్తీస్​గఢ్​ ధంతరీ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నలుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ధంతరి జిల్లాలోని కల్లారీ, మెక్కా గ్రామాల్లో ప్రత్యేక పోలీసు కార్యదళం​... కూబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన పోలీసులు నలుగురు మావోయిస్టులను హతమార్చారు.

ఘటనా స్థలంలోని నాలుగు మృత దేహాలను, 7 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం

Last Updated : Jul 6, 2019, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details