తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసులపై కుర్రాళ్ల టిక్​టాక్​.. తర్వాత ఏమైందంటే? - తమిళనాడు వార్తలు

పోలీసుల వాహనంపై టిక్​టాక్​ వీడియోలు తీసిన కుర్రాళ్లకు వినూత్న రీతిలో సమాధానమిచ్చారు ఉన్నతాధికారులు. వీడియో తీసి షేర్​ చేసిన ముగ్గురు యువకులను రోజంతా ట్రాఫిక్​ నియంత్రించాలని ఆదేశించారు.

పోలీసులపై కుర్రాళ్ల టిక్​టాక్​
పోలీసులపై కుర్రాళ్ల టిక్​టాక్​

By

Published : Jan 10, 2020, 6:02 AM IST

తమిళనాడు తూత్తుకుడిలో ముగ్గురు బాలురు.. పోలీసుల వాహనంపై టిక్​టాక్ వీడియో చేశారు. అది బాగా వైరల్​ కావటం వల్ల పోలీసుల కళ్లల్లో పడింది. వీడియోపై ఆరా తీశారు. బాధ్యులైన ముగ్గురు కుర్రాళ్లు.. షిను, గోకులకృష్ణన్​, సెకురాలను మందలించి రోజంతా ట్రాఫిక్​ నియంత్రించాలని ఆదేశించారు.

పోలీసులపై కుర్రాళ్ల టిక్​టాక్​

ఈ విషయంపై స్పందించిన తూత్తుకుడి డిప్యూటీ ఎస్పీ ప్రకాశ్.. ఇది శిక్ష కాదన్నారు. గేలి చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదని.. అందుకు ప్రతిగా పోలీసుల సేవలో భాగస్వాములం అవుతామని వాళ్లే అడిగారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న వారి కోరిక మేరకు అంగీకరించామని ఎస్పీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details