ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో నక్సలైట్లు దారుణానికి ఒడిగట్టారు. డీజిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు. ఈ పేలుడులో ముగ్గురు పౌరులు మృతి చెందారు.
నక్సలైట్ల దుశ్చర్యకు ముగ్గురు సామాన్యులు బలి - నక్సలైట్ల
ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. డీజిల్ ట్యాంకర్ లక్ష్యంగా బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
నక్సలైట్ల దుశ్చర్యకు ముగ్గురు సామాన్యులు బలి
కొస్రొండ, టుమాపాల్ గ్రామాల మధ్య ఉదయం 11 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం వచ్చిన డీజిల్ ట్యాంకర్‌ను పేల్చేయగా... డ్రైవర్ సహా అందులో ఉన్న మరో ఇద్దరు చనిపోయినట్లు వివరించారు. నక్సలైట్ల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి : 'సోషల్ మీడియా నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు'
Last Updated : Oct 1, 2019, 7:58 PM IST