జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా వాచ్చి ప్రాంతంలో పోలీసులు, ముష్కరులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. వీరందరూ హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందినవారని స్పష్టం చేశారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం - Three Hizbul Mujahideen terrorists,
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్... ముగ్గురు ముష్కరులు హతం
వాచ్చి ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగించారు. తీవ్రంగా ప్రతిఘటించిన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఇదీ చూడండి: మరికాసేపట్లో భాజపా అధ్యక్ష పదవికి 'నడ్డా' నామినేషన్
Last Updated : Jan 20, 2020, 3:06 PM IST