హరియాణా అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు అందిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఈ స్టేషన్‌తో పాటు దేశ రాజధాని దిల్లీ, అయోధ్య, పంజాబ్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించేందుకు 15మంది కుట్రపన్నుతున్నారని ఆ లేఖలో ఉంది. దీనికి ప్రధాన సూత్రధారి జలంధర్ రామామండీకి చెందిన రాజేశ్ వైశ్ అని లేఖ పేర్కొంది.
ఈ లేఖను పంపిన వ్యక్తి పేరు గూఢచారి మౌనిక అని ఉంది. ఉగ్రవాదులు తనను బంధిస్తే వారి నుంచి తప్పించుకుని లేఖ ద్వారా విషయం తెలియజేస్తున్నట్లు పేర్కొంది. ఈ దాడులు జరిపేందుకు పాకిస్థాన్ రూ.25కోట్లు ఇస్తున్నట్లు లేఖలో ఉంది.