తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గజరాజులకు ప్రాణదాతగా సుపరిచితుడు ఈ వైద్యుడు - world elephant day

అందరిలాగే ఆయన పశువైద్యాధికారిగా అటవీ శాఖలో చేరారు. కానీ, ఏనుగులకు చికిత్స చేసే ఓ వైద్యుడితో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించటం వల్ల గజరాజులంటే మక్కువ పెరిగింది. అవి అనారోగ్యానికి గురైతే సొంత బిడ్డల్లా చూసుకుంటూ వైద్యం అందిస్తారు. 30 ఏళ్ల వృత్తి జీవితంలో 50 ఏనుగులను ప్రాణాపాయం నుంచి కాపాడారు.

elephant doctor s
గజరాజులకు ప్రాణదాతగా సుపరిచితులు ఈ వైద్యులు

By

Published : Aug 12, 2020, 7:23 PM IST

అటవీ శాఖ అధికారులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జంతువులను రక్షిస్తారు. ముఖ్యంగా అటవీశాఖకు అనుసంధానమైన పశు వైద్యుల సేవలు ఎనలేనివి. వన్యప్రాణులకు చికిత్స చేసేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వాటిని రక్షించేందుకు కృషి చేస్తారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన డాక్టర్ క్రిష్​ అశోకన్​ ఒకరు. ఆయనను ఏనుగుల వైద్యుడిగానే పిలుస్తారు. 30 ఏళ్ల వృత్తి జీవితంలో సుమారు 50 ఏనుగులను రక్షించారాయన.

గున్న ఏనుగుతో డా. అశోకన్​

1990లో అందరిలాగే పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు డా. అశోకన్​. ఏనుగుల వైద్యులుగా సుపరిచితులైన డా. కృష్ణమూర్తితో పాటు సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించిన క్రమంలో ఏనుగులపై మక్కువ పెరిగింది.

ఏనుగుకు వైద్యం అందిస్తోన్న డా. అశోకన్​

బుధవారం(ఆగస్టు 12) ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆయన వృత్తి జీవితంలో మరిచిపోలేని కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నారు అశోకన్​. వన్యప్రాణుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటే ఈ ఉద్యోగం చాలా సులభమని చెబుతున్నారు.

" కొద్ది సంవత్సరాల క్రితం.. సత్యమంగళం అడవిలో ఓ గున్న ఏనుగు అనారోగ్యంతో మరణానికి దగ్గరైనట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులను తల్లి ఏనుగు దగ్గరకు రానివ్వలేదు. దానిని దూరంగా వెళ్లగొట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అధికారులు అక్కడికి చేరుకునే లోపే పిల్ల ఏనుగు 80 శాతం మేర మరణించింది. అయితే.. ఆశ్చర్యకరంగా రెండు రోజుల్లోనే ఆ గున్న ఏనుగు కోలుకోవటమే కాదు.. తల్లి ఏనుగును చేరింది. ఆ సమయంలో తల్లి ఏనుగు కళ్లలో నీళ్లు తిరుగుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కనిపించింది.

1998లో కేరళ-తమిళనాడు సరిహద్దులోని ముదుమలయ్​లో 20 మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన ఏనుగును కాల్చేయాలని ఆదేశించింది కేరళ ప్రభుత్వం. ఆ నిర్ణయంపై వన్యప్రాణి సంరక్షక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఏనుగును గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి గుర్తించగా ఏనుగు శరీరంలో 22 తూటాలు దిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆ ఏనుగును తన సొంత బిడ్డలా చూసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందించగా కొద్ది రోజులకు కోలుకుంది. "

- డా. క్రిష్​ అశోకన్​, పశువైద్యాధికారి

ఏనుగులను పట్టుకుంటున్న అధికారులు, గ్రామస్థులు
ఏనుగుకు వైద్యం చేస్తోన్న డా. అశోకన్​
గున్న ఏనుగుతో డా.అశోకన్​

ఇదీ చూడండి: అటవీ ఏనుగుల మృతి ఘటనలపై కేంద్రం సీరియస్​

ABOUT THE AUTHOR

...view details