తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్యాకుమారి టూ కశ్మీర్​... 13 ఏళ్ల బాలుడి సైకిల్​ యాత్ర - కన్యాకుమారి టూ కశ్మీర్​

దేశాన్ని సైకిల్​పై చుట్టిరావాలన్న 13 ఏళ్ల అజిత్​ లక్ష్యాన్ని కేంద్ర హోంశాఖ మెచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్​కు వచ్చిన కేరళ బాలుడికి వాఘా సరిహద్దులో అపూర్వ స్వాగతం పలికింది. 25 రోజుల్లో రికార్డు స్థాయిలో 4,185 కిలోమీటర్ల దూరం సైకిల్​పై ప్రయాణించాడు అజిత్​.

13 ఏళ్ల బాలుడి సైకిల్​ యాత్ర

By

Published : Sep 11, 2019, 5:16 PM IST

Updated : Sep 30, 2019, 6:11 AM IST

13 ఏళ్ల బాలుడి సైకిల్​ యాత్ర

అజిత్​ కృష్ణ... కేరళకు చెందిన 13 ఏళ్ల బాలుడు. చిన్న వయసులోనే కన్యాకుమారి నుంచి కశ్మీర్​కు సైకిల్​పై వచ్చిన అజిత్​ను చూసి కేంద్ర హోంశాఖ మురిసిపోయింది. అతడి సంకల్పానికి మెచ్చి పంజాబ్​ వాఘా సరిహద్దులో సాదర స్వాగతం పలికింది. వాఘాలో బీఎస్​ఎఫ్​ పరేడ్​, జెండా ఆవిష్కరణకు ప్రత్యేకంగా ఆహ్వానించింది హోంశాఖ.

అత్యంత దూరం సైకిల్​పై ప్రయాణించిన బాలుడి(15 ఏళ్లలోపు)గా గిన్నిస్​ వరల్డ్​ రికార్డు సాధించాలని అజిత్​ లక్ష్యం. అనుకున్నదే తడవుగా పాలక్కడ్​ జిల్లా చిత్తూరు నుంచి 2019 జులై 10న సైకిల్​పై దేశయాత్రకు బయలుదేరాడు. 30 రోజుల్లో 4 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు.

అజిత్​ పట్టుదల ముందు ఆ సమయం చాలా ఎక్కువైపోయింది. 25 రోజుల్లోనే కశ్మీర్​కు చేరుకున్నాడు. ఇక గిన్నిస్ రికార్డు అధికారికంగా వరించటమే మిగిలింది.

ఇదీ చూడండి: అలనాటి ఫ్యాషన్​కు.. నేటి తరం సొబగులు!

Last Updated : Sep 30, 2019, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details