తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కల్లోలం: కేరళలో మూడో కేసు నమోదు - కరోనా వైరస్

కేరళలో కరోనా వైరస్​ జడలు విప్పుతోంది. కాసార్​గోడ్​లో తాజాగా మరో కేసు నమోదయింది. ఆ వ్యక్తి చైనాలోని వుహాన్​ నుంచి వచ్చినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్యమంత్రి శైలజ తెలిపారు. భారత్​లో నమోదైన 3 కేసులు కేరళలోనే కావటం గమనార్హం.

kerala
kerala

By

Published : Feb 3, 2020, 12:59 PM IST

Updated : Feb 29, 2020, 12:02 AM IST

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి చెందిన కేరళలో మూడో కేసు నమోదయింది. కాసార్​గోడ్​కు చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

అతనికి కంజన్​గడ్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.

దేశంలో ఇప్పటి వరకు నమోదైన 3 కేసులు.. కేరళకు చెందినవే కావటం గమనార్హం. వీరు ముగ్గురు.. కరోనా వైరస్​ పుట్టిన చైనాలోని వుహాన్​ నగరం నుంచి వచ్చినవారేనని శైలజ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: భారత్​లో మరో కరోనా కేసు.. రెండోది కేరళలోనే

Last Updated : Feb 29, 2020, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details