ఈ 'బడి దొంగ' నిజాయితీకి నెటిజన్ల ఫిదా! మహారాష్ట్ర పుణే జిల్లా ఆంబెగావ్ మండల పరిధిలోని చాందోళి బుద్రుక్ గ్రామంలో ఓ నిజాయితీ గల దొంగ కలకలం సృష్టించాడు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకే వారంలో రెండుసార్లు చోరీలకు పాల్పడి చర్యలు తీసుకోవద్దంటూ బోర్డుపై రాసి వెళ్లాడు.ఆ దొంగ 32 అంగుళాల రెండు టీవీలను దొంగిలించుకెళ్లాడు. ఒక్కో టీవీ సుమారు 45 వేల రూపాయలు వెల ఉంటుంది. అందులో పిల్లలకు పాఠాలు చెప్పే ఓ సాఫ్ట్వేర్ సైతం ఉంది.
దొంగ వేషాలకు లభించని కనికరం
మొదటిసారి దొంగతనం జరిగిపోయింది. పాఠశాల ప్రిన్సిపల్ దీపాలీ జలిందర్ అజబ్ కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. బోర్డుపై వింతగా ఏదో రాసుందని చెప్తే వెళ్లి చూసి ఖంగుతిన్నారు.
"నేను స్కూల్ వస్తువులు దొంగిలించాలని అనుకోలేదు. నా కుటుంబ పరిస్థితులే నాతో ఈ పని చేయించాయి. దయచేసి పోలీసులకు నాపై ఫిర్యాదు చేయొద్దు. నా దగ్గర డబ్బులున్నప్పుడు నేను మీకు డబ్బు తిరిగిస్తాను" అంటూ బడిలోని బోర్డు మీద రాసి వెళ్లాడు.
దొంగ అంతలా బతిమాలినా కనికరించలేదు ప్రిన్సిపల్. వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఒక్కసారికీ వదిలేయండి ప్లీజ్
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలుసుకున్న దొంగ.. మరో సారి స్కూళ్లోకి దూరాడు. "దయచేసి కంప్లైంట్‌ను వెనక్కి తీసుకోండి." అని మరో సారి బోర్డుపై రాసి వేడుకున్నాడు.
ఈ బడిలో దొంగను తొందరగా పట్టుకుని మర్యాదలు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:కశ్మీర్‌లోని ఆడవారిని పెళ్లి చేసుకోండి: భాజపా ఎమ్మెల్యే