తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భేదాభిప్రాయాలున్నా... ఇతరుల వాదనను గౌరవించాలి' - conclave

వ్యక్తులు, సంస్థల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజల  జీవన విధానం అలా ఉండాలని ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో సందేశమిచ్చారు.

'భేదాభిప్రాయాలున్నా..ఇతరుల అభిప్రాయాలు గౌరవించాలి'

By

Published : Aug 30, 2019, 2:48 PM IST

Updated : Sep 28, 2019, 8:51 PM IST

ప్రజా జీవితంలో వ్యక్తులు, సంస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి ఆలోచలను మరొకరు గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు మోదీ. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా.. చర్చలకు ఆస్కారం ఉండాలన్నారు.

ఇతరుల ఆలోచనలు తమ ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్న వారితో మమేకమయ్యేందుకు అందరూ ఇష్టపడతారని, అది వారికి సౌకర్యంగా అనిపిస్తుందని అన్నారు మోదీ. అయితే ప్రతిఒక్కరూ అలా వ్యవహరించకుండా అందరితో కలసి ఉండాలన్నారు.

ఇంటి పేరు, ప్రతిష్ఠల ఆధారంగా విజయం సాధించలేరని పేర్కొన్నారు మోదీ. వ్యక్తిగత సామర్థ్యం, సాధించాలనే సంకల్పంతోనే అన్నీ సాధ్యమవుతాయన్నారు.

గతంలో లైసెన్స్‌ రాజ్‌, పర్మిట్‌ రాజ్‌ల కారణంగా ప్రజల ఆకాంక్షలకు అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు మోదీ. ప్రస్తుత నవ భారతంలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేశామని చెప్పారు.

ఇదీ చూడండి: ఆరోగ్య భారత్​కు 12,500 ఆయుష్​ కేంద్రాలు: మోదీ

Last Updated : Sep 28, 2019, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details