తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా విద్యుత్ పరికరాలతో సైబర్ దాడులు! - చైనా విద్యుత్​ పరికరాలతో జాగ్రత్త

చైనా విద్యుత్​ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విద్యుత్​శాఖ మంత్రి ఆర్​.కె.సింగ్ తెలిపారు. వీటి ద్వారా మాల్వేర్, ట్రోజన్ హార్స్​లను ప్రవేశపెట్టి సైబర్ దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు.

The possibility of cyber attacks with Chinese electrical equipment
చైనా విద్యుత్ పరికరాలతో సైబర్ దాడులు

By

Published : Jun 29, 2020, 4:48 AM IST

చైనా నుంచి వచ్చే విద్యుత్తు పరికరాలతో అప్రమత్తంగా ఉండాలని భారత్‌ హెచ్చరించింది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలు వినియోగించే వాటిలో మాల్వేర్‌, ట్రోజన్‌ హర్స్‌లను ప్రవేశపెట్టి... చైనా విక్రయించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ సామగ్రి కనుక భారత్‌ విద్యుత్తు గ్రిడ్‌తో అనుసంధానమైతే సంక్షోభ సమయంలో... చైనా వాటిని కుప్పకూలేటట్లు చేస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ స్వయంగా పేర్కొనడం గమనార్హం.

ఇటీవల కాలంలో భారత్‌లో దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించేందుకు చైనా పరికరాలపై అత్యధిక టారీఫ్‌లు విధిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో వినియోగించే పరికరాలపై ఈ ఛార్జీలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

"విద్యుత్తు రంగం అత్యంత వ్యూహాత్మకమైంది. దేశంలోని కంపెనీలు, పరిశ్రమలు, కమ్యూనికేషన్లు దీనిపై ఆధారపడి నడుస్తాయి. ఏదైనా శత్రుదేశం ఈ మార్గంలో భారత్‌ను దెబ్బతీసే అవకాశం మేము ఇవ్వం. దీనికి అడ్డుగా ఓ ఫైర్‌వాల్‌ నిర్మాణం చేపడతాము. చైనా విద్యుత్ పరికరాల్లో మాల్వేర్లు, ట్రోజన్‌ హార్స్​లు ఉంటున్నట్లు మాకు సమాచారం ఉంది. అందుకే ఈ సున్నితమైన రంగంలో భారతీయ పరికరాలు ఉండేట్లు చూస్తాము. ఒక వేళ దిగుమతులు అవసరమైతే పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడతాము" అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని విద్యుత్తు రంగంపై ఇప్పటికే పలుమార్లు సైబర్‌ దాడులు జరిగాయి. వీటిల్లో అత్యధిక భాగం రష్యా, చైనా, సింగపూర్‌, కామన్‌వెల్త్‌ దేశాల నుంచే జరిగినట్లు గుర్తించారు.

ఇదీ చూడండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details