తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ హింసాత్మక ఘటనలపై సుప్రీంలో వ్యాజ్యం

రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన అల్లర్లపై సుప్రీకోర్టులో పిల్​ దాఖలైంది. హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని న్యాయవాది విశాల్​ తివారి కోరారు.

ట్రాక్టర్​ ర్యాలీ అల్లర్లపై సుప్రీకోర్టులో పిల్​!
The PIL was filed seeking an inquiry into the Delhi tractor rally riots in supreme court

By

Published : Jan 27, 2021, 1:33 PM IST

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విధ్వంస ఘటనలపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్​ ఏర్పాటు చేయాలని కోరారు పిటిషనర్​, న్యాయవాది విశాల్​ తివారి.

హింసకు కారకులైన వారితో పాటు జాతీయ జెండాను అగౌరవపరిచిన వారిపై ఎఫ్​ఐర్​ నమోదు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు పిటిషనర్​. అల్లర్ల కారణంగా న్యాయకార్యకలాపాలకు ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు.

హింసాత్మక ఘటనల్లో దిల్లీ పోలీసులు ఇప్పటికే 22 మందిపై ఎఫ్​ఐర్​ నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఎర్రకోట ఘటనపై రంగంలోకి ఎన్​ఐఏ!

ABOUT THE AUTHOR

...view details