లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు జరుగుతుండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసరాలకూ బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక మహిళలు అయితే గడప కూడా దాటలేని దుస్థితి. ఈ తరుణంలో వారికి అవసరమైన శానిటరీ న్యాప్కిన్ల కొరత అధికంగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో అయితే ఇవి దొరకడమే గగనమైపోయింది. దీని వల్ల మహిళలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు న్యాప్కిన్లను అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చుతూ.. కొరత లేకుండా చూడాలని అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది కేంద్రం.
కేంద్రం సూచనతో చురుకుగా ఆ జిల్లా..
కేంద్రం చేసిన ఈ సూచనకు లఖ్నవూ జిల్లా యంత్రాంగం చురుగ్గా స్పందించింది. జిల్లావ్యాప్తంగా ఉచితంగా న్యాప్కిన్లను సరఫరా చేస్తోంది. అన్ని ప్రాంతాలకూ వీటిని అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.