తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్ బరి: కానిస్టేబుల్‌కు టికెట్‌.. డీజీపీకి నిరాశ! - బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు 2020

బిహార్ ఎన్నికల వేళ ఓ ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఇటీవల జేడీయూలో చేరిన మాజీ డీజీపీకి టికెట్​ దక్కలేదు. అయితే ఆయన టికెట్ ఆశించిన అదే నియోజకవర్గంలో ఓ కానిస్టేబుల్​ను భాజపా తన అభ్యర్థిగా నిలబెట్టింది.

bihar polls
బిహార్ బరి: కానిస్టేబుల్‌కు టికెట్‌.. డీజీపీకి నిరాశే..!

By

Published : Oct 9, 2020, 7:30 AM IST

గతంలో వారిద్దరూ పోలీసులే. ఒకరు రాష్ట్రానికి మాజీ డీజీపీ కాగా.. మరొకరు కానిస్టేబుల్‌. ప్రస్తుతం ఇద్దరూ రాజకీయాల్లోనే ఉన్నారు. ఇద్దరిలో కానిస్టేబుల్‌ భాజపాకు చెందిన వారు కాగా.. డీజీపీ ఇటీవలె జేడీయూలో చేరారు. ప్రస్తుతం వారు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ ఇక్కడ మాత్రం కానిస్టేబులే ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. పార్టీలు వేరైనా ఇద్దరూ ఆశించింది ఒకే కూటమి నుంచి కావడం వల్ల డీజీపీకి నిరాశ తప్పలేదు. బిహార్‌ ఎన్నికల సమరంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశం ఇది.

పొలిటికల్​ ఎంట్రీ...

బిహార్‌కు చెందిన మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండేకు ఇటీవల సీఎం నితీశ్‌కుమార్‌ సమక్షంలో జేడీయూలో చేరి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఆయన బక్సర్‌ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినట్లు సమాచారం. అయితే ఆ నియోజకవర్గంలో కూటమిలో భాగంగా భాజపా అభ్యర్థికి స్థానం కేటాయించారు. దీంతో మాజీ కానిస్టేబుల్‌ అయిన పరశురాం చతుర్వేది ఎన్నికల్లో పోటీకి అర్హత సాధించగా.. గుప్తేశ్వర్‌ పాండేకు నిరాశ తప్పలేదు.

ఈ సందర్భంగా చతుర్వేది మాట్లాడుతూ.. "డీజీపీ నాకు అన్న. ఆయన పట్ల ఆప్యాయత తప్ప నాకు మరొకటి లేదు. నేను ఎక్కడ పనిచేసినా గౌరవంతో ఉన్నా. నాకు విధుల్లో ఎంతో నిబద్ధతతో ఉంటాననే పేరుంది" అని పేర్కొన్నారు.

పెద్ద ఎన్నికలు...

బిహార్‌లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 28న మొదటి దశ, నవంబర్‌ 3,7 తేదీల్లో మిగతా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్​లో వెల్లడించింది. కాగా నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలు వెలువరించనుంది. ఈ ఎన్నికలు కొవిడ్‌ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద తొలి ఎన్నికలు కానున్నాయి. 243 నియోజకవర్గాలున్న బిహార్‌లో దాదాపు 7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details