తమిళనాడు తిరుపూర్‌లోని ఓ పత్తి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో లక్షలు విలువ చేసే పత్తి, యంత్రాలు కాలి బూడిదయ్యాయి.
పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం.. రూ. లక్షల ఆస్తి నష్టం
తమిళనాడు తిరుపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పంచకుడాన్ వద్ద ఓ పత్తి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన ముడిసరుకు, యంత్రాలు దెబ్బతిన్నాయి.
కంగయం రోడ్ నివాసి అబ్దుల్‌ఖాధర్ కాసిపాలయంలో బనియన్ వేస్ట్ బిన్ సంస్థను నిర్వహిస్తున్నాడు. కంపెనీలో 20 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. శుక్రవారం సాయంత్రం ఓ విభాగం నుంచి పొగ రావడాన్ని చూసిన కార్మికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ మంటలు వేగంగా వ్యాపించిన కారణంగా లక్షలు విలువ చేసే సరుకు అగ్నికి ఆహుతయింది. మంటల నుంచి క్షేమంగా తప్పించుకోలిగారు సిబ్బంది. మంటలు ఆర్పేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమించాయి.
ఇదీ చూడండి:పాక్ ఉగ్ర శిబిరాల్లో 200 మంది కశ్మీరీలు?