తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగుల వర్షం: 105కు చేరిన మృతుల సంఖ్య - bihar cm news

బిహార్​లోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 105కు పెరిగింది. రానున్న 72 గంటల్లో ఉత్తర బిహార్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతారవరణ శాఖ హెచ్చరించింది. అధికారులను అప్రమత్తం చేసింది.

thunderstorm and lightning in Bihar
బిహార్​లో పిడుగుపాటు ఘటనలు

By

Published : Jun 26, 2020, 10:32 AM IST

బిహార్‌లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన పిడుగుల వాన తీవ్ర ప్రాణ నష్టం కలిగించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చనిపోయినవారి సంఖ్య 105కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. అసమ్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిడుగుపాటుకు బలయినట్లు తెలిపింది. ఉత్తర బిహార్ జిల్లాల్లో రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ హెచ్చరించింది.

రూ.4 లక్షల పరిహారం..

పిడుగుపాటుతో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి: 5 లక్షలకు చేరువలో కేసులు, 15 వేలు దాటిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details