తెలంగాణ

telangana

బాబియా... ఇదొక శాకాహార మొసలి

మొసలి తినేది శాకాహారమా? మాంసాహారమా? అని ఏవరినైనా అడిగితే టక్కున మాంసాహారం అని చెప్పేస్తారు. కానీ ఈ మకరాన్ని చూస్తే మాత్రం మీ సమాధానం మార్చుకోవాల్సిందే. కేరళ కాసరగోడ్​ ఆలయంలోని మొసలి పూర్తిగా శాకాహారమే తీసుకుంటుంది. దేవాలయం చుట్టూ ఉన్న కొలనులో కలియ తిరుగుతూ భక్తులకు కనువిందు చేస్తోంది.

By

Published : Oct 24, 2020, 9:09 PM IST

Published : Oct 24, 2020, 9:09 PM IST

Updated : Oct 24, 2020, 11:04 PM IST

The crocodile at Ananthapura Lake Temple lies in front of the sanctum sanctorum
బాబియా... ఇదొక శాకాహార మొసలి

బాబియా... ఇదొక శాకాహార మొసలి

కేరళ కాసరగోడ్​ జిల్లా అనంతపుర ఆలయ ప్రాంగణంలో ఓ మొసలి ఉంది. గుడి చుట్టూ ఉండే కొలనులో ఎప్పుడూ సేదతీరుతూ ఉంటుంది. పూజారి పెట్టే ఆహారాన్ని తీసుకుంటూ.. వచ్చిన భక్తులకు కనువిందు చేస్తోంది. దీనికి 'బాబియా' అనే పేరు కూడా ఉంది.

ఇలా వైరల్​...

ఓ రోజు ఉదయం ఆలయ ప్రధాన పూజారి గర్భగుడి తలుపులు తెరిచే సమయానికి బాబియా అక్కడ ప్రత్యక్షమైంది. ఆందోళన చెందకుండా వెంటనే వేదమంత్రాలను చదివారు పూజారి. తర్వాత మొసలి అక్కడ నుంచి తిరిగి కొలనులోకి చేరుకుంది. ఇదంతా వీడియో రూపంలో చిత్రీకరించి నలుగురితో పంచుకోగా.. వీడియో వైరల్​ అయ్యింది. వేల మంది నెటిజన్లు దీన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.

దైవస్వరూపంగా...

ఈ మొసలిని స్థానికులు సాక్షాత్తు దేవుని స్వరూపంగా భావిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే బాబియా.. గుడికి వచ్చే భక్తులను ఏమీ చేయదు. వచ్చినవారు కూడా దేవుని దర్శనంతో పాటు బాబియా దర్శనం చేసుకుంటారు.

75 సంవత్సరాలుగా...

పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత బాబియా రాత్రికి గర్భగుడిలోకి చేరుకుంటుంది. అయితే బ్రిటీషు వారు పాలించే సమయంలో ఈ మొసలిని కాల్చి గాయపరిచారని ప్రతీతి. అయితే అప్పట్నుంచి ఇది పక్కన ఉన్న గుహను ఆశ్రయం చేసుకొని ఉంటుందని స్థానికులు అంటున్నారు. బాబియాకు సుమారు 75ఏళ్లు ఉంటాయని చెప్తున్నారు.

గుహ నుంచి బయటకు వస్తున్న మొసలి

నైవేద్యానికి వేళాయెరా...

కేవలం శాకాహారం తీసుకునే బాబియా... పూజారి నైవేద్యం తీసుకొని పిలవగానే ఎక్కడ ఉన్నా టక్కున సమీపానికి చేరుకుంటుంది. ఎప్పుడూ నీటిలో ఉంటూ తక్కువగా బయట కనిపించే ఈ మొసలి.. ఆహారం అందిచేందుకు పిలవగానే రావడాన్ని భక్తులు ఓ కమనీయ దృశ్యంగా చూస్తుంటారు.

మొసలికి ఆహరం అందిస్తున్న పూజారి

ఇదీ చూడండి: సైకిల్​ ఫర్ ఛేంజ్​: అనారోగ్య సమస్యలు, కాలుష్యానికి ఇక చెక్​

Last Updated : Oct 24, 2020, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details