తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చుట్టూ నీరు... 8 రోజులుగా ఇంటిపైనే దంపతులు!

ఉత్తరాది రాష్ట్రం బిహార్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. 8 రోజులుగా ఇక్కడి 18 గ్రామాలు నీటి ముప్పులోనే చిక్కుకున్నాయి. ముంగేర్​ నగరంలో పరిస్థితి మరీ ఘోరం. టెలిడీహ పరిధిలోని కృష్ణానగర్​ గ్రామానికి చెందిన ప్రజలు దుర్బర జీవనం గడుపుతున్నారు. తమ ఇల్లు పూర్తిగా నీట మునగగా.. పక్కింటి పైకప్పు పైన జీవనం సాగిస్తున్నారు భార్య, భర్త.

చుట్టూ ద్వీపం... 8 రోజులుగా ఇంటిపైనే దంపతులు..!

By

Published : Oct 1, 2019, 1:41 PM IST

Updated : Oct 2, 2019, 6:04 PM IST

చుట్టూ నీరు... 8 రోజులుగా ఇంటిపైనే దంపతులు!

ఎడతెరిపి లేని వానలతో బిహార్​ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముంగేర్​ నగరంలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వరదలతో ఇక్కడి 18 గ్రామపంచాయితీలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. టెలిడీహ పరిధిలోని కృష్ణానగర్​ గ్రామం చెరువును తలపిస్తోంది. 8 నుంచి 10 అడుగుల మేర నీరు చేరి... ఇళ్లన్నీ మునిగిపోయాయి. దాదాపు 40 కుటుంబాలు ఊరు వదిలి.. బరియర్​పుర్​-ఖరగ్​పుర్​ రహదారి వెంబడి దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారు.

అయితే.. అనారోగ్యం కారణంగా ఉమాకాంత్​ పాసవాన్​, గీతా దంపతులు ఎటూ వెళ్లలేక పక్కింటిపైనే జీవిస్తున్నారు. 2 మేకలు, 4 కోడిపుంజులతో సహా 8 రోజులుగా అక్కడే ఉంటున్నారు. రాష్ట్రంలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్న వారి కుమారుడు... ఈ విషయం తెలుసుకొని తమ తల్లిదండ్రులను రక్షించాల్సిందిగా అధికారులను వేడుకుంటున్నాడు.

Last Updated : Oct 2, 2019, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details