తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం కాన్వాయ్​ని బైక్​తో ఢీకొట్టిన యువకుడు - రోడ్డు

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కాన్వాయ్​పైకి ఓ యువకుడు బైక్​తో దూసుకొచ్చాడు. వేగంగా వస్తున్న కారును ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

సీఎం కాన్వాయ్​ని బైక్​తో ఢీకొట్టిన యువకుడు

By

Published : Aug 25, 2019, 7:00 PM IST

Updated : Sep 28, 2019, 5:53 AM IST

సీఎం కాన్వాయ్​ని బైక్​తో ఢీకొట్టిన యువకుడు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ కాన్వాయ్​​పైకి ఓ యువకుడు అకస్మాత్తుగా బైక్​తో దూసుకొచ్చాడు. సీఎం ప్రయాణిస్తున్న ముందు వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కాన్వాయ్​లోని మూడో వాహనంలో ఉన్నారు ముఖ్యమంత్రి.
ఈ ఘటనలో తీవ్రగాయాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతను ఉద్దేశ పూర్వకంగా చేశాడా లేక అనుకోకుండా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ జరిగింది...

శనివారం మహాజందేశ్​ యాత్ర సందర్భంగా షేగావ్​లోని దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చారు ముఖ్యమంత్రి. అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్​ను నియంత్రించారు. కానీ ఓ యువకుడు హఠాత్తుగా సీఎం కాన్​వాయ్​పైకి బైక్​తో దూసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది:విద్యా ప్రమాణాల్లో బిహార్​తో దిల్లీ పోటీ!

Last Updated : Sep 28, 2019, 5:53 AM IST

ABOUT THE AUTHOR

...view details