తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ను నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్రంపై దీదీ ఫైర్​ - Mamata Banerjee latest news

బంగాల్​ పట్ల కేంద్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇందుకు రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. బయటి వారు తన రాష్ట్రంలో పెత్తనం చెలాయించలేరని వ్యాఖ్యానించారు.

The Central govt has neglected us: West Bengal Chief Minister Mamata Banerjee
బంగాల్​ను నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్రంపై దీదీ ఫైర్​

By

Published : Jul 21, 2020, 3:36 PM IST

కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ. రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు ప్రతిగా బంగాల్ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ధ్వజమొత్తారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంపై అధికారం చెలాయించలేరంటూ పరోక్షంగా భాజపాపై విమర్శలు గుప్పించారు మమత.

" ఉత్తర్​ప్రదేశ్​లో ఏం జరుగుతోంది? పోలీసులకు ఫిర్యాదు చేయాలంటేనే అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ ఘటనలో పులువురు పోలీసులు హత్యకు గురయ్యారు.

బంగాల్​ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉంది. కొంతమందికి కనీస రాజకీయ అనుభవం లేదు. వారు ప్రజలను చంపడం, ఉద్రిక్తతలను పెంచడం గురించి మాట్లాడతారు."

-మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం.

ఇదీ చూడండి: రాజస్థాన్ పాలిటిక్స్‌: వీడని ఉత్కంఠ!

ABOUT THE AUTHOR

...view details