కొవిడ్-19 లాక్‌డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా డ్రైవింగ్ లైసెన్స్, వాహన సామర్థ్య ధ్రువీకరణపత్రం వంటి వాహన సంబంధ పత్రాల చెల్లుబాటు గడువును తాజాగా సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. గతంలో ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. "ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రవాణా రంగంలోనివారు, పౌరులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాహన సంబంధ పత్రాలను సెప్టెంబర్-30 వరకు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాం" అని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జయరాం గడ్కరీ మంగళవారమిక్కడ తెలిపారు.
వాహనదారులకు శుభవార్త.. లైసెన్స్ గడువు పెంపు - డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు పెంపు
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఓ శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన సామర్థ్య ధ్రువీకరణపత్రం లాంటి వాహన పత్రాల చెల్లుబాటు గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచింది. లాక్‌డౌన్ తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు పెంపు