తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శశి థరూర్​కు న్యాయస్థానం సమన్లు

కాంగ్రెస్ నేత శశి థరూర్​కు దిల్లీలోని అదనపు చీఫ్​ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్​ కోర్టు​ సమన్లు జారీచేసింది. ఓ మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై నమోదైన​ పరువునష్టం దావా కేసును న్యాయస్థానం విచారిస్తోంది.

By

Published : Apr 27, 2019, 7:12 PM IST

Updated : Apr 27, 2019, 8:12 PM IST

శశి థరూర్​కు న్యాయస్థానం సమన్లు

కాంగ్రెస్​ నేత శశిథరూర్​కు దిల్లీలోని అదనపు చీఫ్​ మెట్రోపాలిటన్​ మేజిస్ట్రేట్​ కోర్టు సమన్లు జారీచేసింది. జూన్​ 7న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్.. ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

శశిథరూర్​పై క్రిమినల్ పరువునష్టం దావా వేశారు దిల్లీకి చెందిన భాజపా నేత రాజీవ్ బబ్బర్​. శశిథరూర్​ వ్యాఖ్యలు ఓ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసును చీఫ్​ మెట్రోపాలిటన్​ మేజిస్ట్రేట్​ సమర్ విశాల్​ విచారిస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు తాను చేసినవి కాదని, ఓ ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త మాటలను ఊటకించానని గత అక్టోబర్​లో శశిథరూర్​ పేర్కొన్నారు. ఆరేళ్లుగా జన బాహుళ్యంలో ఉన్న విషయాలనే తాను పేర్కొన్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలపడానికే ఆ వ్యాఖ్యలు చేశానని ట్విట్టర్​ వేదికగా వివరణ ఇచ్చారు థరూర్​.

ఇదీ చూడండి: 4వ దశ ఎన్నికల ప్రచార అంకం సమాప్తం

Last Updated : Apr 27, 2019, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details