తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదుల దాడిలో భాజపా సర్పంచ్​ మృతి - కశ్మీర్​ ఉగ్రదాడులు

Terrorists fired
జమ్ముకశ్మీర్​: సర్పంచ్​పై ఉగ్రవాదుల కాల్పులు

By

Published : Aug 6, 2020, 9:59 AM IST

Updated : Aug 6, 2020, 11:18 AM IST

11:15 August 06

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భాజపా నాయకుడు, సర్పంచ్‌ సజ్జాద్ అహ్మద్ ఖాండేను తీవ్రవాదులు కాల్చి చంపారు. క్వాజిగుండ్ ప్రాంతంలోని వెస్సులో సజ్జాద్‌ ఇంటి సమీపంలోనే ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 

స్థానికులు హుటాహుటిన సర్పంచ్‌ను.. అనంత్‌ నాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుల్గాం జిల్లాలో భాజపా అనుబంధ పంచాయతీ సభ్యుడిని కాల్చిన 48 గంటల్లోనే మరో భాజపా నేతపై దాడి జరగడం కలకలం రేపింది. పంచాయతీ సభ్యుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

09:55 August 06

జమ్ముకశ్మీర్​: సర్పంచ్​పై ఉగ్రవాదుల కాల్పులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలోని భాజపా సర్పంచ్​ అహ్మద్​ ఖాండే​ నివాసంపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సర్పంచ్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Aug 6, 2020, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details