తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత భూభాగం వైపు నేపాల్ కాల్పులు.. సరిహద్దులో ఉద్రిక్తత - భారత్ లక్ష్యంగా నేపాల్ కాల్పులు.. సరిహద్దు వెంట ఉద్రిక్తత

బిహార్ మోతీహరి జిల్లా ఝరోఖర్ ప్రాంతం ఖర్సల్వా సరిహద్దు వద్ద భారత్ పౌరులు లక్ష్యంగా గాలిలోకి కాల్పులు జరిపింది నేపాల్ సైన్యం. ఇరువర్గాల మధ్య జరిగిన చర్చల అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. అయితే తాజా ఉద్రిక్తతలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తోంది.

nepal
భారత్​పై నేపాల్ కాల్పులు.. సరిహద్దు వెంట ఉద్రిక్తత

By

Published : Jul 24, 2020, 10:33 PM IST

భారత్, నేపాల్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. బిహార్​ మోతీహరి వద్దనున్న ఝరోఖర్​ ఖర్సల్వా సరిహద్దు వద్ద భారత్​ లక్ష్యంగా గాలిలోకి కాల్పులు జరిపారు నేపాల్ సైనికులు. ఇరుదేశాల మధ్య నూతన చిత్రపటం రేపిన ఉద్రిక్తతల అనంతరం పరిస్థితులు సద్దుమణిగే దశలో.. నేపాల్ ఈ ఘాతుకానికి పాల్పడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

బలగాల మధ్య చర్చ

ఇదీ జరిగింది..

ఎరువుల అక్రమ రవాణాపై ఇరుదేశాల పౌరుల మధ్య వివాదం తలెత్తింది. అనంతరం సరిహద్దు దాటి వచ్చిన నేపాల్​ సైనికులను భారత పౌరులు బంధించారు. ఈ నేపథ్యంలో గాలిలోకి కాల్పులు జరిపిన నేపాల్ సైన్యం.. ఓ భారతీయ పౌరుడిని అదుపులోకి తీసుకుంది. ఇరువర్గాల మధ్య చర్చల అనంతరం బందీలను మార్పిడి చేసుకున్నారు. అయితే గాలిలోకి కాల్పులు జరిపిన అనంతరం సరిహద్దుకు ఇరువైపులా ఉద్రిక్తతలు నెలకొన్నట్లు తెలుస్తోంది.

నేపాల్ సైనికులతో భారత జవాన్ల సంభాషణ

ఇదీ చూడండి:రాజ్​భవన్​లో 'రాజ'కీయం- అసెంబ్లీ సమావేశం కోసం ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details