తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో మరో 'దిశ'... ఇంటికి సమీపంలోనే! - ఒడిశాలో మరో 'దిశ

ఒడిశాలోని గుమండలి గ్రామంలో ఓ బాలిక మృతదేహం కలకలం సృష్టించింది. తన నివాసానికి సమీపంలోని పోలంలోనే మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలోని పరిస్థితులను గమనిస్తే... ఆ మైనర్​పై అత్యాచారం జరిపి, హత్య చేసినట్టు తెలుస్తోంది.

Tension In Odisha Village Over Suspected Gangrape, Murder Of Minor
ఒడిశాలో మరో 'దిశ'... ఇంటికి సమీపంలోనే!

By

Published : Dec 14, 2019, 6:52 PM IST

Updated : Dec 14, 2019, 10:14 PM IST

ఒడిశాలో మరో 'దిశ'... ఇంటికి సమీపంలోనే!

ఒడిశాలోని నవరంగ్​పుర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుమండలి గ్రామంలో రక్తసిక్తమైన ఓ బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించడం కలకలం రేపింది. ఆ మైనర్​ శరీరంపై గాయాలు, ఘటనాస్థలంలోని పరిస్థితులను గమనిస్తే... హైదరాబాద్​ పశువైద్యురాలు దిశ హత్యాచార ఉదంతంలాగే ఉందని స్థానికులు అంటున్నారు.

ఏం జరిగింది?

గ్రామంలోని పొలంలో ఓ బాలిక మృతదేహాం కనిపించింది. ఆ మైనర్​పై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసినట్టు అర్థమవుతోంది.

ఘటనా స్థలానికి 300 మీటర్ల దూరంలోనే ఆ బాలిక నివాసం ఉంది. ఈ ఇంటి నుంచే ఆమెను బలవంతగా తీసుకొచ్చి.. పొలంలో ఆఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన గుర్తులు కూడా లభించాయి. బాలిక శరీరంపై గాయాలున్నాయి.

ఈ ఘాతుకానికి పాల్పడిన వారి వివరాలపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. అయితే మృతదేహానికి కొద్ది దూరంలో రెండు ప్యాంట్లు పడి ఉన్నాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Dec 14, 2019, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details