అసోం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో చాలా మంది గాయపడ్డారు. మిజోరంలోని కొలాసిబ్, అసోంలోని కాచర్ జిల్లా సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అసోం సీఎం సర్బానంద సోనోవాల్, మిజోరం సీఎం జోరామ్థంగా ఫోన్ ద్వారా మాట్లాడారు. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు అంగీకరించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
ఫోన్ సంభాషణ..
ఈ విషయమై ప్రధాని, కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు సోనోవాల్ తెలిపారు.
"అసోం, మిజోరం సరిహద్దు వద్ద జరిగిన ఘటనపై జోరామ్థంగాతో ఫోన్లో సంభాషించాను. ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఇరువురమూ అంగీకరించాం. రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని కేంద్రానికి విన్నవించాం."
- సర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి