ఫొటోగ్రఫీ మొదలు... అడవుల్లో కలప దొంగలను పట్టించే వరకు ఎన్నో నూతన మార్పులను సమాజానికి పరిచయం చేశాయి డ్రోన్లు. వైద్య సేవల్లో డ్రోన్ల వినియోగానికి ఇంతకుముందే కొంతమంది ప్రయత్నించారు. తాజాగా ఇలాంటి ప్రయోగమే ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో జరిగింది. నందగావ్ నుంచి రక్తాన్ని తెహ్రీ జిల్లా కేంద్రంలోని పరిశోధనశాలకు తరలించేందుకు డ్రోన్‌ను వినియోగించి విజయం సాధించారు. భౌగోళికంగా డ్రోన్ ప్రయాణానికి అంత అనుకూలంగా లేని ప్రాంతాల్లోనూ ఈ ప్రయోగం సఫలమవడం మరో విశేషం.
"ప్రయోగంలో భాగంగా నందగావ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు విజయవంతంగా రక్తాన్ని తరలించాం. ఈ నమూనాను చేరవేసేందుకు డ్రోన్‌కు 18 నిమిషాల సమయం పట్టింది."