జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కవ్‌దారా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది లక్ష్యంగా గ్రనేడ్‌దాడి జరిపారు. ఈ దాడి నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు.
సీఆర్పీఎఫ్ సిబ్బందే లక్ష్యంగా కశ్మీర్లో గ్రనేడ్ దాడి - terraorists attack
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కవ్దారాలో శనివారం సీఆర్పీఎఫ్ సిబ్బందే లక్ష్యంగా గ్రనేడ్ దాడి జరిపారు. వారు సురక్షితంగా బయటపడగా.. ఓ 16 ఏళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.
సీఆర్పీఎఫ్ సిబ్బందే లక్ష్యంగా కశ్మీర్లో గ్రనేడ్ దాడి
అయితే ఘటనా సమయంలో.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ 16ఏళ్ల బాలుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి ఇంతవరకు బాధ్యత వహించలేదు. ఇదిలా ఉండగా శ్రీనగర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Last Updated : Jan 5, 2020, 4:45 AM IST