బాలాకోట్ వైమానిక దాడుల్లో భారత సాంకేతికతే కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఉద్ఘాటించారు. ఇదే దాడిలో రఫేల్ యుద్ధ విమానాలను వాడి ఉంటే భారీ ఫలితాలు ఉండేవని తెలిపారు. దిల్లీలో జరిగిన '2040లో ఏరోస్పేస్ పవర్' చర్చా వేదికలో ధనోవా ప్రసంగించారు.
"బాలాకోట్ ఆపరేషన్లో అధునాతన సాంకేతికత మన వైపే ఉంది. పాకిస్థాన్ భూభాగంలోకిరాత్రివేళ ప్రవేశించాం. చీకట్లోనూ సైనికేతర లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగాం. ఇందుకు 'ప్రెసిషన్ స్టాండాఫ్' ఆయుధాలను వాడాం. ఈ దాడుల్లో ఆధునికీకరించిన మిగ్-21 బైసన్, మిరాజ్-200 విమానాలను ఉపయోగించాం.ఆ సమయంలో మన వద్ద రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే భారీ స్థాయి ఫలితాలు ఉండేవి. రెండేళ్లలో రఫేల్ యుద్ధవిమానాలు, ఎస్-400 క్షిపణి వ్యవస్థలు భారత అమ్ములపొదిలోకి చేరతాయి. "
- వాయుసేనాధిపతి బీఎస్ ధనోవా