తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్ నడవాపై నేడు భారత్​-పాక్​ సమావేశం - derababa nanak

కర్తార్​పుర్ నడవా ప్రారంభానికి సంబంధించి సాంకేతిక సమావేశాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది. భారత అధికారులు ఈ భేటీకి అంగీకరించినట్లు వెల్లడించింది.

కర్తార్​పుర్ నడవాపై నేడు భారత్​-పాక్​ సమావేశం

By

Published : Aug 30, 2019, 8:29 AM IST

Updated : Sep 28, 2019, 8:04 PM IST

కర్తార్​పుర్​ నడవాపై సాంకేతిక సమావేశం నిర్వహించాలన్న పాకిస్థాన్ ప్రతిపాదనకు భారత్​ అంగీకారం తెలిపినట్లు ఆ దేశ విదేశీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. నేడు జరగనున్న ఈ భేటీలో ఇరుదేశాల ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు.

పంజాబ్​ సరిహద్దు వెంబడి నిర్మిస్తోన్న కర్తార్​పుర్ నడవా (4.7 కిలోమీటర్లు) ఇరుదేశాలలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతుంది. సిక్కు గురువు గురునానక్​ దేవ్​ 550 జయంతి (2019 నవంబర్​) లోగా ఈ నడవా పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

భారత్​ పంజాబ్​లోని సిక్కు పవిత్ర క్షేత్రం 'డేరా బాబా నానక్​ సాహెబ్'​, అలాగే పాకిస్థాన్​ పంజాబ్​లోని 'గురుద్వారా దర్బార్​ సాహిబ్​ కర్తార్​పుర్​' లను ఈ నడవా కలుపుతుంది. ఫలితంగా ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాలను వీసా లేకుండా దర్శించడానికి మార్గం సుగమమవుతుంది.శ్రమ తగ్గుతుంది.

ప్రస్తుతం భారత సిక్కులు బస్సులో లాహోర్ చేరుకుని అక్కడ నుంచి కర్తార్​పుర్​లోని పవిత్ర సిక్కు క్షేత్రానికి చేరుకుంటున్నారు. అంటే సుమారు 125 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. నిజానికి కేవలం 4.7 కిలోమీటర్ల దూరంలోని ఆ పవిత్ర దేవాలయాన్ని భారత దేశం నుంచి బైనాక్యులర్ ఉపయోగించి చూడవచ్చు. నడవా పూర్తయితే ఈ సమస్య తీరి ఇరుదేశాల భక్తులు పరస్పరం తమ పవిత్ర దేవాలయాలను సులభంగా దర్శించుకోవచ్చు.

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

Last Updated : Sep 28, 2019, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details