తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్రమ హోర్డింగులపై మద్రాస్​ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

తమిళనాడులో ఫ్లెక్సీ తెగిపడి ఓ యువతి మరణించడంపై.. మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వక్తం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అక్రమ హోర్డింగ్​ల తొలగింపుపై కఠిన చర్యలు చేపడుతుందా? లేదా? అని ప్రశ్నించింది. 'ప్రభుత్వాలపై మాకు నమ్మకం పోయిందని' ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

అక్రమ హోర్డింగులపై మద్రాస్​ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

By

Published : Sep 13, 2019, 5:05 PM IST

Updated : Sep 30, 2019, 11:36 AM IST

అక్రమ హోర్డింగులపై మద్రాస్​ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

అక్రమ హోర్డింగ్​ల విషయంలో తమిళనాడు ప్రభుత్వ తీరుపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓ యువతిహోర్డింగ్ కారణంగా మరణించిన నేపథ్యంలో.. ఇలా మరెన్ని ప్రాణాలు కోల్పోవాలంటూ ఆవేదన వెలిబుచ్చింది న్యాయస్థానం. అనధికార బ్యానర్ల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందా? లేదా? అని హైకోర్టు ఫ్లెక్సీలకు సంబంధించిన ఓ పిటిషన్​పై విచారణ సందర్భంగా ప్రశ్నించింది.

"రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎన్ని లీటర్ల రక్తంతో రహదారులకు రంగు వేయాలనుకుంటోంది."
- మద్రాస్​ హైకోర్టు

ముఖ్యమంత్రీ... మీ సంగతేంటి?

ముఖ్యమంత్రి పళనిస్వామి కనీసం ఇప్పుడైనా అనధికార బ్యానర్లు పెడుతున్న వారికి వ్యతిరేకంగా ఓ ప్రకటన జారీ చేయగలరా? అని హైకోర్టు ప్రశ్నించింది.

"ఈ దేశంలో ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది. ఇది ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోంది. మాకు ప్రభుత్వం మీద నమ్మకం పోయింది."
- మద్రాస్ హైకోర్టు

ట్రాఫిక్ రామస్వామి పిటిషన్​తో

రహదారిపై అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీ తెగిపోయి​ మీద పడటం వల్ల తమిళనాడులో 23 ఏళ్ల యువతి మరణించింది. పల్లవరం-తొరైపాకం రహదారిలో బైక్​పై ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటనపై స్పందించిన ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వంపై, రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి:దిల్లీలో మరోమారు సరి-బేసి విధానం: కేజ్రీవాల్​

Last Updated : Sep 30, 2019, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details