తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్: పాఠశాలలు షురూ- విద్యార్థులు గైర్హాజరు - కశ్మీర్

జమ్ముకశ్మీర్​లో పూర్తిస్థాయిలో ఆంక్షల ఎత్తివేతకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం లోయలోని మరిన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించింది. శ్రీనగర్​లోని 190 పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు విధుల్లో చేరినప్పటికీ.. చాలా పాఠశాలల్లో విద్యార్థులు తరగతులకు హాజరుకాలేదు.

కశ్మీర్: పాఠశాలల ప్రారంభం-విద్యార్థులే రాలేదు

By

Published : Aug 19, 2019, 2:01 PM IST

Updated : Sep 27, 2019, 12:39 PM IST

కశ్మీర్: పాఠశాలల ప్రారంభం-విద్యార్థులే రాలేదు

అధికరణ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలను సడలిస్తున్నారు అధికారులు. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండగా... నేడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. కానీ చాలా మంది విద్యార్థులు తరగతులకు హాజరుకాలేదు.

లోయలోని చాలా ప్రాంతాల్లో ఇంకా బలగాల మోహరింపు కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రత్యేక ఏర్పాట్ల మధ్య శ్రీనగర్​లో 190 పాఠశాలలు తెరుచుకున్నాయి. అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో 15వ రోజు కూడా ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోలేదు. బెమినా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని కేంద్రీయ విద్యాలయాల్లోనే పూర్తిస్థాయిలో విద్యార్థుల సంఖ్య కనిపించింది.

ఐదు పట్టణాలు మినహా...

బారముల్లా జిల్లాలోని పఠాన్​, పల్హలాన్​, సంఘపోర్, బారముల్లా, సోపోర్​లలో ఆంక్షలు ఎత్తివేయకపోటం వల్ల అక్కడ పాఠశాలలు తెరుచుకోలేదు. ఈ ఐదు పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

శ్రీనగర్​లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. రోడ్లపై బారికేడ్లను తొలగించారు అధికారులు. ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. ప్రజలు ఇప్పుడిప్పడే రోడ్లపైకి వస్తున్నారు.

ఇదీ చూడండి: ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?

Last Updated : Sep 27, 2019, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details