తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తనుశ్రీ ఆరోపణలకు ఆధారాల్లేవు: పోలీసులు - మీటూ

ప్రముఖ నటుడు నానాపటేకర్​పై తనుశ్రీ దత్తా పెట్టిన లైంగిక వేధింపుల కేసులో ముంబయి పోలీసులు బీ సమ్మరీ రిపోర్టు దాఖలు చేశారు. ఫిర్యాదుకు మద్దతుగా ఆధారాలు లభించకపోవడం వల్ల దర్యాప్తును సాగించలేక పోతే పోలీసులు బీ సమ్మరీ రిపోర్టును దాఖలు చేస్తారు.

తనుశ్రీ లైంగిక వేధింపుల కేసులో నివేదిక దాఖలు

By

Published : Jun 13, 2019, 4:29 PM IST

Updated : Jun 13, 2019, 5:21 PM IST

మరోసారి తనుశ్రీ దత్తా-నానాపటేకర్​ లైంగిక వేధింపుల కేసు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ముంబయి పోలీసులు గురువారం బీ సమ్మరీ రిపోర్టు దాఖలు చేశారు. పోలీసుల నివేదిక సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఏంటీ బీ సమ్మరీ రిపోర్టు?

ఫిర్యాదుకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లభించక... దర్యాప్తును సాగించలేని పరిస్థితుల్లో పోలీసులు బీ సమ్మరీ రిపోర్టు దాఖలు చేస్తారు.

మీటూ...

బాలీవుడ్​ ప్రముఖ నటుడు నానాపటేకర్​ తనను లైంగికంగా వేధించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈ విషయంపై బాలీవుడ్​లో పెద్ద దుమారం రేగింది. దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది. పలువురు ప్రముఖులు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు.

ఈ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం జోరందుకుంది. ఎందరో ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఫిర్యాదుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.

Last Updated : Jun 13, 2019, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details