తమిళనాడులో 10, 11 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. పళనిస్వామి ప్రకటించారు. అర్ధవార్షిక, త్రైమాసిక పరీక్షల ఫలితాలు, హాజరు శాతం ఆధారంగా విద్యార్థులను పైతరగతులకు పంపిస్తున్నట్లు (ప్రమోట్) ఆయన స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కుదిరే పని కాదని తేల్చిచెప్పారు.
12వ తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పళనిస్వామి వెల్లడించారు. కరోనా కాలంలో 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టి, పరీక్షలు నిర్వహించడం ఏ మేరకు సబబు అని మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.