ఉత్తర భారతంలో ఎక్కవగా చూసే ప్రాంతాల పేర్లలో మార్పులను.. ఇప్పుడు దక్షిణ భారతం అవలంబిస్తోంది. తాజాగా తమిళనాడులో దాదాపు 1,018 ప్రాంతాల పేర్లను తమిళ ఉచ్ఛారణకు తగ్గట్లు ఇంగ్లీష్‌లో మార్చాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే వేసిన ఓ అత్యున్నత స్థాయి కమిటీ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు ప్రముఖ ప్రాంతాల్లోని పేర్లు ఇకపై విభిన్నంగా కనిపించనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పళనిస్వామి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1979లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీ రామచంద్రన్.. నగరాలలో కులాల పేరిట ఉన్న వీధులు, కూడళ్ల పేర్లను మార్చారు.
కొన్ని పేర్లు ఇలా..
తొండియార్ పేట- తాండయ్యార్పేట్టాయ్
పురసవాల్కమ్- పురసైవాక్కమ్
వేపెరి- వేప్పెరి