తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోరుబావిలోనే సుజిత్- 60 గంటలకుపైగా సహాయక చర్యలు

తమిళనాడు నడుకట్టుపట్టిలో బోరుబావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్​ను​ రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. బాలుడు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

'బోరుబావిలో పడిన చిన్నారి స్పృహతప్పినా..బతికే ఉన్నాడు.'

By

Published : Oct 28, 2019, 6:44 AM IST

Updated : Oct 28, 2019, 9:45 AM IST

'బోరుబావిలో పడిన చిన్నారి స్పృహతప్పినా..బతికే ఉన్నాడు.'

తమిళనాడు తిరుచిరాపల్లి నడుకట్టుపట్టిలో.....బోరుబావిలో పడిన రెండేళ్ల పసివాడు సుజిత్ విల్సన్‌ను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నెల 25న ఇంటిముందు ఆడుకుంటున్న విల్సన్.. ప్రమాదవశాత్తు 600 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. అప్పటి నుంచి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

పసివాడు స్పృహ కోల్పోయినప్పటికీ శ్వాస మాత్రం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఘటనాస్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. మరోవైపు చిన్నారి క్షేమంగా బయటపడాలని ప్రముఖులు, రాజకీయనేతలు సహా అందరూ ప్రార్థిస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సినీనటులు రజినీకాంత్, కమల్ హాసన్ తదితరులు చిన్నారి క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాధినేతలు

Last Updated : Oct 28, 2019, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details