తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో జల్లికట్టుకు బసవన్నలు సిద్ధం - తమిళనాడు జల్లికట్టు

తమిళనాడువ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. బుధవారం నుంచి మధురై జిల్లాలో సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభం కానుంది. జనవరి 31వరకు జరిగే ఈ పోటీల్లో అనేక ప్రాంతాల నుంచి బసవన్నలు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

Tamil Nadu: Jallikattu competitions to be held from January 15 - January 31 in Madurai district. 730 bulls in Avaniyapuram, 700 bulls in Alanganallur and 650 bulls in Palamedu are participating in Jallikattu competitions this year. Visuals from Avaniyapuram. (13.01.2020)
తమిళనాడులో జల్లికట్టుకు బసవన్నలు సిద్ధం

By

Published : Jan 14, 2020, 11:28 AM IST

Updated : Jan 14, 2020, 4:36 PM IST

తమిళనాడులో జల్లికట్టుకు బసవన్నలు సిద్ధం

దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ పండుగ వచ్చిందంటే చాలు ఊరూరా సందడి నెలకొంటుంది. ముఖ్యంగా పశువుల పందేలకు పెట్టింది పేరు సంక్రాంతి. తమిళనాడులో అయితే సంప్రదాయ క్రీడ జల్లికట్టు ఎంతో ప్రత్యేకం.

మధురై జిల్లాలో బుధవారం ప్రారంభం కానున్న జల్లికట్టు పోటీలు జనవరి 31 వరకు జరగనున్నాయి. ఇందుకోసం ఔత్సాహికులు సర్వసన్నద్ధమవుతున్నారు. అవనియపురం నుంచి 730 బసవన్నలు బరిలోకి దిగనున్నాయి. అలంగానల్లూరు నుంచి 700, పలమేడు నుంచి 650 ఎద్దులు జల్లికట్టు పోటీలో పాల్గొననున్నాయి.

కాలుదువ్వుతున్న కోడిపుంజులు

సంక్రాంతి బరిలోకి కోడిపుంజులూ దిగుతున్నాయి. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో గురువారం కోడి పందేలు ప్రారంభం కానున్నాయి.

ఇదీ చూడండి:'5 ట్రిలియన్ల​ ఆర్థిక వ్యవస్థే కాదు.. అంతకు మించి'

Last Updated : Jan 14, 2020, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details